TG LAW CET 2025 Results: తెలంగాణ లాసెట్ ఫలితాలు రిలీజ్!

TG LAW CET Results Out Now: తెలంగాణలో లా సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు. కాగా మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్సెట్ ఫలితాలు నిర్వహిస్తారని తెలిసిందే. ఫలితాలను http://lawcet.tgche.ac.in అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
జూన్ 5, 6న రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్, పీజీ ఎల్ సెట్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించారు. లాసెట్ కు ఈ ఏడాది 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే మూడేళ్ల ఎల్ఎల్బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకు 13,491 మంది పరీక్షలు రాశారు. ఇటీవలే కీ విడుదల కాగా.. తాజాగా పలితాలు రిలీజ్ చేశారు. కాగా కౌన్సెలింగ్ ప్రక్రియ జులైలో ఉంటుందని అధికారులు చెప్పారు.