Last Updated:

అశోక్ గెహ్లాట్ : ఏప్రిల్ 1 నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఎల్‌పిజి సిలిండర్ల ధరలకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుండి, బిపిఎల్ మరియు

అశోక్ గెహ్లాట్ : ఏప్రిల్ 1 నుంచి  రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు.. రాజస్థాన్  సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఎల్‌పిజి సిలిండర్ల ధరలకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుండి, బిపిఎల్ మరియు ఉజ్వల కేటగిరీల కింద ఉన్న వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు గెహ్లాట్ ఈరోజు తెలిపారు.

మా ప్రభుత్వం వివరాలను అధ్యయనం చేస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతాను. ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను,. ప్రధాని నరేంద్ర మోదీ ఒక డ్రామా చేశారు. ఎల్‌పిజి కనెక్షన్ మరియు గ్యాస్ స్టవ్ ఇవ్వడం కోసం ఉజ్వల యోజన పేరు పెట్టారు. ఇప్పుడు వారి సిలిండర్లు ఖాళీగా పడి ఉన్నాయి. ఎల్‌పిజి ధరలు రూ. 400 నుండి రూ. 1040కి పెరిగినందున ఎవరూ కొనడం లేదు. బీపీఎల్ కింద వచ్చే వ్యక్తులు లేదా ఉజ్వలతో లింక్ అయినవారి గురించి అధ్యయనం చేస్తాము ఏప్రిల్ 1 నుండి, వారు ప్రస్తుత ధర రూ. 1040కి బదులుగా ఒక్కొక్కటి రూ. 500 చొప్పున సంవత్సరానికి 12 సిలిండర్లను పొందుతారు,” అని గెహ్లాట్ చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ ఎన్నికలలో దీనిని వాడుకునే అవకాశముంది. ఒక సభను ఉద్దేశించి గెహ్లాట్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రతినెలాద కుటుంబాలకు కిరాణా సామాగ్రిని అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించేందుకు రానున్న రోజుల్లో ఇదే విషయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఆహార పదార్థాల ధరలు పెరిగినా, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: