Nidhhi Agerwal Photos: రవివర్మ చిత్రంలా హోయలు పోతున్న వీరమల్లు భామ – నిధి అగర్వాల్ లేటెస్ట్ శారీ ఫోటోలు చూశారా..?

Nidhhi Agerwal latest Photo: హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగ చైతన్య సవ్యసాచి చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మిజ్ను వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు, రామ్ పోతినేని సరసన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది

ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో నిధి ఖాతాలో తొలి కమర్షియల్ హిట్ పడింది, ఆ తర్వాత ఆమెకు వరుస ప్లాప్స్ రావడంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి

ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. అక్కడ కూడా పెద్దగా హిట్స్ లేకపోవడం ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి

ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమాతో ఈ భామ తెలుగులో రీఎంట్రీ సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది

హరి హర వీరమల్లుతో పాటు ప్రభాస్ రాజా సాబ్‌లోనూ హీరోయిన్గా నటిస్తుంది. దీంతో ఈ భామ చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి

అదే క్రేజ్ వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది.

తాజాగా పింక్ కలర్ శారీలో రవివర్మ బొమ్మలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.