India Pakistan War: మధ్యవర్తిత్వం కొత్తకాదు.. భారత్, పాకిస్థాన్ మధ్య గతంలోనూ పలు ప్రయత్నాలు

India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి.
1966లో సోవియట్ యూన్‌యన్..
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్‌లోని) తాష్కెంట్‌లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ ఇద్దరూ కలిసి 1966 జనవరి 10న ఒప్పందంపై సంతకాలు చేశారు.
1986-87లో రెండు అగ్రరాజ్యాలు..
ఆపరేషన్ ‘బ్రాస్ ట్రాక్స్ పేరిట’ 1986-87 సంవత్సరంలో ఇండియా-పాక్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. పరిస్థితి చేదాటి యుద్ధం దిశగా వెళ్తుండటంతో అగ్రరాజ్యాలు అమెరికా, సోవియట్ జోక్యం చేసుకొని భారత్, పాకిస్థాన్ దేశాలను సముదాయించాయి. ఉద్రిక్తతలను తగ్గించాయి.
1990లో బుష్ జోన్యం..
కశ్మీర్, పంజాబ్‌ల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో 1990లో ఇండియా తన సైన్యాన్ని సరిహద్దుల్లో భారీగా మోహరించింది. దీంతో పాకి కూడా జర్బ్_ఎ_మోమిన్ పేరిట సైన్యాన్ని కదిలించింది. ఏ క్షణమైనా యుద్ధభేరి మోగుతుందని అణ్వస్త్రాల వినియోగం జరుగుతుందని ఆందోళనలు తలెత్తాయి. దీంతో అమెరికా అప్పటి అధ్యక్షుడు బుష్ తమ జాతీయ భద్రత ఉపాధ్యక్షుడు రాబర్ట్ గేట్స్‌ను వెంటనే పంపించారు. అతడు రెండు దేశాల నేతలతో మాట్లాడి పరిస్థితిని చల్లబడేలా చేశారు.
1990 కార్గిల్ యుద్ధం..
పాక్ సైన్యం అత్యుత్సాహంతో రెండు దశాల మధ్య 1990లో కార్గిల్ చిచ్చు మొదలైంది. ఇండియా తీవ్రస్థాయిలో తిప్పికొట్టింది. దీంతో పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ ఉక్కిరిబిక్కిరై హుటహుటినా అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ను కలిశారు. సమావేశానికి హాజరయ్యేందుకు నాటి భారత ప్రధాని వాజ్‌పేయి నిరాకరించారు. పాకిస్థాన్ వైదొలగాల్సిందేనని పట్టుబట్టారు. అమెరికా ఒత్తిడి, భారత సైన్యం దూకుడు కారణంగా పాకిస్థాన్ తోకముడిచింది.
పార్లమెంటుపై దాడి..
2021లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి, 2008లో 26/11ముంబయి దాడులు, 2019లో బాలాకోట్‌పై వైమానికి దాడుల తర్వాత కూడా పాకిస్థాన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సందర్భాలన్నింటిలోనూ అమెరికాతోపాటు వివిద దేశాలు రంగ ప్రవేశం చేసి, దౌత్య చర్చల ద్వారా పరిస్థితులు సమరానికి దారితీయకుండా సర్దిచెప్పాయి.