Viral News : పెళ్లి వేడుకలో మృతి చెందిన వధువు.. కానీ పెళ్లి ఎలా జరిగిందంటే..?
పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం. దాన్ని ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేల చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు… సరదాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. నూతనంగా పెళ్లి చేసుకునే జంట తమ పెళ్లిని ఓ మధురానుభూతిలా ఉంచుకునేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు.
Viral News : పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం. దాన్ని ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేల చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు… సరదాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. నూతనంగా పెళ్లి చేసుకునే జంట తమ పెళ్లిని ఓ మధురానుభూతిలా ఉంచుకునేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు , పెళ్లికూతురు కలిసి డ్యాన్స్ చేసుకుంటూ కళ్యాణ వేదిక పైకి రావటం… పెళ్లి ఊరేగింపులో కలిసి డ్యాన్స్ చేయటం చూస్తూనే ఉంటున్నాం. ఇటీవల కాలంలో ఈ రకమైన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ పెళ్లి వేడుక మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.
మరికొన్ని గంటలలో వివాహం జరగాల్సిన ముహూర్తం వచ్చేస్తుంది. బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతోంది. వరుడు కూడా వధువు ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే ఆ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి వధువు గుండె పోటుతో కన్నుమూసింది. అయినా కానీ ఆ వివాహం ఆగకుండా జరగడం ఇప్పుడు అందరికీ ప్రశ్నార్ధకంగా మారింది. అందరికీ ఒకింత షాక్ గా అనిపిస్తున్న అ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం..
బాధ దిగమింగుతూ పెళ్లి (Viral News)..
గుజరాత్ లోని భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్ద కుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగాల్సి ఉండగా వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో వధువు హేతల్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను సమీపం లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె గుండె పోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
అయితే ఇంతటి విషాదం లోనూ వధువు తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగకూడదని నిర్ణయించుకొని హేతల్ స్థానంలో.. ఆమె చెల్లిలిని ఇచ్చి పెళ్లి జరిపించేందుకు ముందుకొచ్చారు. అందుకు విశాల్, అతని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దీంతో హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి వచ్చి వివాహం జరిపించారు. ఒక పక్క బాధను దిగమింగుతూనే వరుడు గురించి కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ఆ కుటుంబం పట్ల నెటిజన్లు మిశ్రమ రీతిలో స్పందిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/