Gold Price Dropped: తగ్గిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత రేటు ఉందంటే..?
Huge Drop in Gold Price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల బంగారం ధర ఏకంగా 11వందల40 రూపాయలు తగ్గి లక్షా 370రూపాలయకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92వేల వద్ద కొనసాగుతోంది. ఇరన్ ఇజ్రాయిల్ యుద్దం నడుస్తున్న నేపథ్యంలో అందులో అమెరికా కలుగజేసుకోవడంతో బంగారం ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ బంగారం తగ్గుముఖం పట్టింది. అందుకు కారణాలను నిపుణులు తెలియజేశారు. అమెరికాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గింది కావున పెట్టుబడిదారులు బంగారంపై నుంచి దృష్టిని మరల్చినట్లు తెలిపారు. బంగారం పై పెట్టిన పెట్టుబడిని వేరే వాటిపైకి మళ్లిస్తున్నారు.
24క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉంటుంది. దానిని కరిగించిన తర్వాత ఆభరణాలు తయారు చేస్తారు. ఈ బిస్కెట్ బంగారంతో డైరెక్ట్ గా ఆభరణాలు తయారు చేయలేరు.
22 క్యారెట్ల బంగారం అంటే ఇది కరిగించిన కడ్డీ రూపంలో ఉంటుంది. దీనిలో కొంత రాగిని కలుపుతారు. అప్పుడే దాంతో ఆభరణాలు తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 24 క్యారెట్ల బంగారం ధర కంటే 22క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. దీన్ని 916గా సూచిస్తారు.
హైదరాబాద్ లో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,370గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర 92వేలు.
ఢిల్లీలో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,520గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,150.
విజయవాడలో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,370గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,000.
వైజాగ్ లో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,370గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,000.
చెన్నైలో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,520గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,150.
ముంబై, కోల్ కతా, కేరళలో 24క్యారెట్ల తులం బంగారం ధర (10గ్రాముల ధర) రూ.1,00,520గా ఉంది. 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,150.