Last Updated:

Union Budget 2023: బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న మిడిల్ క్లాస్.. ఈ సారారైనా కరుణిస్తారా?

వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.

Union Budget 2023: బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న మిడిల్ క్లాస్.. ఈ సారారైనా కరుణిస్తారా?

Union Budget 2023: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ ( Union Budget 2023) పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చే ప్రోత్సకాలపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈ సారి బడ్జెట్ లో మధ్య తరగతిపైనా ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ‘నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు.

ఇక పై కూడా మోదీ ప్రభుత్వం మధ్య తరగతి వారి కోసమే పనిచేస్తుంది’ అని ఇప్పటికే నిర్మలా సీతారామన్((Nirmala Sitharaman) ) వ్యాఖ్యానించారు.

 

పన్ను భారం తగ్గించుకునేందుకు ఉన్న ప్రధాన మార్గం సెక్షన్ 80 సి. ఇందులో భాగంగా రూ. లక్షా 50 వేల వరకు వివిధ పథకాల్లో పొదుపు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

ఈపీఎఫ్, వీపీఎఫ్, జీవిత భీమా, పన్ను ఆదా ఎఫ్ డీలు, పిల్లల ట్యూషన్ ఫీజులు.. ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే 2014 నుంచి వీటిలో మార్పు లేదు.

అయితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. 2014 లో రూ. లక్షా 50 వేలు సరిపోతే , ఇపుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఈ బడ్జెట్ లో ఆ పరిమితి ని పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

 

ఆదాయ పన్ను పరిమితిలో కొన్నేళ్లుగా అనుకున్నంత మార్పు లేదు. పన్ను వర్తించే ఆదాయం పరిమితి రూ. 5 లక్షల వరకూ ఉన్నా.. కొన్ని నిబంధనల మేరకే అనుమతిస్తున్నారు.

కాబట్టి ఈసారి బడ్జెట్( Union Budget 2023) ఈ విబాగంలో భారీగా మార్పులు ఉండవచ్చనే అంచనాలు పెరిగాయి.

మూల ధన పన్ను నిబంధలను మార్చడంతో పాటు వైద్య,జీవిత బీమా ప్రీమియానికి ప్రత్యేక మినహాంపులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.

కరోనా మొదలైనప్పటి నుంచి క్యాపిటల్ మార్కెట్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది మధ్యతరగతి.

కాబట్టి వారికి లబ్ఢి చేకూరేలా మూలధనంపై లాభాలు అర్జింజే పన్నును మరింత సరిళీకరించే అవకాశం ఉంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/