PM Modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. అధికారులు అలర్ట్
![PM Modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. అధికారులు అలర్ట్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/modi.webp)
Threat Call to PM Modi Plane: ప్రధాని నరేంద్ర మోదీకి టార్గెట్ చేస్తూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతూ కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదని గుర్తించారు. కాగా, ఈ కాల్ ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు ముందే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.