Last Updated:

Bangalore: బెంగళూరు ఫ్లైఓవర్‌పై నుంచి కరెన్సీ నోట్లు విసిరేసిన వ్యక్తి

బెంగళూరులోని  ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.

Bangalore: బెంగళూరు ఫ్లైఓవర్‌పై నుంచి కరెన్సీ నోట్లు విసిరేసిన వ్యక్తి

Bangalore ..బెంగళూరులోని  ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.

ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.

ఆ వ్యక్తి రూ.10 నోట్ల రూపంలో మొత్తం రూ.3,000 విసిరేసాడు.

నడిచేవారు మరియు వాహనదారులు మొత్తం ఆశ్చర్యానికి లోనయ్యారు.

వారి పాదాల వద్ద 10 రూపాయల కరెన్సీ నోట్లు పడటం ప్రారంభించడం చూసి నమ్మలేకపోయారు.

బెంగళూరు కేఆర్ పురం ఫ్లైఓవర్ ..

కేఆర్‌ పురం  మార్కెట్‌ ఫ్లైఓవర్‌పై ఈ వ్యక్తి  కరెన్సీ నోట్లను విసరడం ప్రారంభించాడు.

అయితే, పోలీసులు వచ్చే సరికి ఆ వ్యక్తి ఫ్లైఓవర్ నుండి తప్పించుకున్నాడు.

వైరల్ వీడియోను చిత్రీకరించడమే దీని వెనుక ఉద్దేశ్యం అని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది

సాధారణంగా రద్దీగా ఉండే కళాసిపాళ్యం ప్రాంతంలో ఈ పరిణామం తీవ్ర కలకలం సృష్టించింది.

ఫ్లైఓవర్‌కు ఇరువైపుల నుంచి కరెన్సీ నోట్లను విసిరాడు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమన్నారంటే.. (Bangalore)

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (వెస్ట్) లక్ష్మణ్ నింబరాగి మాట్లాడుతూ
ఈ సంఘటన గురించి మాకు పెద్దగా తెలియదు.
ఇన్‌పుట్‌లు సేకరించిన తర్వాత మేము సమాచారాన్ని మీతో పంచుకుంటామంటూ మీడియాకు తెలిపారు.

బెంగళూరు లో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీ మహిళ అరెస్ట్

తన గుర్తింపును ఫోర్జరీ చేసి బెంగళూరులో అక్రమంగా ఉంటోందని ఆరోపిస్తూ

19 ఏళ్ల పాకిస్థాన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్రా జీవని అనే మహిళ

గత ఏడాది నేపాల్ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించింది.

గేమింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన

25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ములాయం సింగ్ యాదవ్‌ను ఆమె వివాహం చేసుకుంది.

ఇక్రా మరియు యాదవ్ యాప్‌లో కలుసుకున్నారు మరియు ప్రేమలో పడ్డారు.

తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీనితో ఆమె నేపాల్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకుని

ఇండియా-నేపాల్ సరిహద్దు గుండా భారత్‌కు చేరుకుంది.

అనంతరం  వీరిద్దరు బీహార్  చేరుకున్నారు.

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఇక్రా జీవనిని బెంగళూరుకు యాదవ్ తీసుకొచ్చాడు.

ఈదంపతులు జున్నసంద్రలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

ఆమె పేరును రావ యాదవ్‌గా మార్చిన తర్వాత ఆమె ఆధార్ కార్డును కూడా పొందారు.

తరువాత ఆమె భారతీయ పాస్‌పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసింది.

జీవని పాకిస్థాన్‌లో తిరిగి తన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నందున

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆమె జాడను ట్రాక్ చేయడంతో ఆమె గుర్తింపు వెలుగులోకి వచ్చింది.

సమాచారం మేరకు నగర పోలీసులు దంపతుల వివరాలను సేకరించి వారి ఇంటిపై దాడి చేసొ వారిని అరెస్టు చేశారు.

ఇక్రా జీవని ని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకు అప్పగించారు.

వారు ఆమెను మహిళల కోసం స్టేట్ హోమ్‌కు రిమాండ్ చేశారు.

పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి విదేశీయుల చట్టంలోని సంబంధిత సెక్షన్ మరియు

ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

దంపతులు నివాసముంటున్న ఆస్తి యజమాని గోవింద రెడ్డి తన భవనంలో అక్రమంగా ఉంటున్న విదేశీ మహిళ గురించి

పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు విదేశీయుల చట్టంలోని

సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/