Last Updated:

Two Thousand Currency Notes: రెండు వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.

రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

Two Thousand Currency Notes:  రెండు వేల నోట్ల  మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.

Two Thousand Currency Notes:రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

చలామణిలో రూ. 12,000 కోట్ల నోట్లు..(Two Thousand Currency Notes)

ఈ ఏడాది మే 19న 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించే సమయానికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. అందులో 3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు చెప్పారు. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయన్నారు. ప్రస్తుతం రూ. 12,000 కోట్లకు పైగా నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి, పొడిగించిన వ్యవధి ముగిసిన తర్వాత కూడా నోట్లను తిరిగి ఇవ్వవచ్చని పునరుద్ఘాటించారు. 2వేల నోట్ల డిపాజిట్‌ కోసం సెప్టెంబర్‌ 30 వరకు ఇచ్చిన గడువును ఇటీవల ఆర్‌బీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 7తో ఆ గడువు కూడా ముగియనుంది. అయితే 8వ తేదీ తర్వాత ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉందని శక్తికాంత దాస్‌ చెప్పారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎవరైనా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించలేని వాళ్లు తపాలా శాఖ సేవలను వినియోగించుకోవచ్చన్నారు శక్తికాంత దాస్‌.