Last Updated:

Bangladesh: బంగ్లాదేశ్ లో 2 లక్షలకు పైగా డెంగ్యూ కేసులు.. 1000 కు పైగా మరణాలు.

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్ లో 2 లక్షలకు పైగా  డెంగ్యూ కేసులు.. 1000 కు పైగా మరణాలు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.

దోమల బారిన పడకుండా..(Bangladesh)

మునుపటి రికార్డుల ప్రకారం, ఈ సంవత్సరం, ఇది దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. 2022లో, ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కనీసం 281 మంది మరణించారు అయితే ఇపుడు కేవలం తొమ్మిది నెలల్లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డెంగ్యూ, దోమల నుండి ప్రజలకు వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణంలో ఇది సర్వసాధారణం. డెంగ్యూ వచ్చిన వారికి, అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, వికారం మరియు దద్దుర్లు చాలా సాధారణ లక్షణాలు. ఇవి చాలా వరకు 1-2 వారాల్లో తగ్గుతాయి. కొంతమందికి తీవ్రమైన డెంగ్యూ వచ్చినపుడు ఆసుపత్రిలో చికిత్స అవసరం. తీవ్రమైన సందర్భాల్లో, డెంగ్యూ ప్రాణాంతకం కావచ్చు. డెంగ్యూ జ్వరం యొక్క చాలా సందర్భాలలో నొప్పి మందులతో ఇంట్లోనే చికిత్స చేయవచ్చు కానీ డెంగ్యూ రాకుండా ఉండటానికి దోమ కాటు బారిన పడకుండా ఉండటమే మార్గం. ఎసిటమైనోఫెన్ (పారాసెటమాల్) తరచుగా నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.ఆఫ్రికా, అమెరికా, తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా మరియు పశ్చిమ పసిఫిక్‌లో ప్రాంతాలలోని 100 కంటే ఎక్కువ దేశాలలో డెంగ్యూ స్థానికంగా ఉంది. అమెరికా, ఆగ్నేయాసియా మరియు పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు డెంగ్యూతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి