Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడికి ఆరేళ్లు.. ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్!

Pulwama Terror Attack modi emotional tweet: భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 అనేది ఒక చీకటి రోజు. ఇదే తేదీన సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారత సైనికులపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనPulwama Terror Attackలో ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ దార్‌తో పాటు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పక్కా ప్రణాళికతో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటన జరిగిన తర్వాత భారత్ సైనం ప్రతీకారం తీర్చుకుంది. వెంటనే జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఆపరేషన్ చేపట్టింది. భారత్.. ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఘటన చోటుచేసుకొని నేటికీ ఆరేళ్లు గడిచింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘2019లో జరిగిన పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు. భావితరాలు మీరు చేసిన త్యాగాలతో పాటు దేశం కోసం మీకున్న అంకితభావాన్ని ఎప్పటికీ మర్చిపోరు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మిమ్మల్ని దేశం మరువదు.’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Homage to the courageous heroes we lost in Pulwama in 2019. The coming generations will never forget their sacrifice and their unwavering dedication to the nation.
— Narendra Modi (@narendramodi) February 14, 2025