Last Updated:

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పిఎఫ్ఐ కుట్ర

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పిఎఫ్ఐ కుట్ర

New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు. యూపీకి చెందిన మరికొందరు ప్రముఖుల పై సైతం దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు తేల్చారు. పీఎఫ్ఐ ఆఫీసులు, ప్రతినిధుల ఇళ్లలో 2 రోజుల కిందట సోదాలు నిర్వహించిన అధికారులు, నిందితులను ఆరా తీయగా అసలు విషయాలు బయటకు వచ్చినట్టు తెలిపారు.

ఈ ఏడాది జులై 12వ తేదీన పాట్నాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా పీఎఫ్ఐ నేతలు షఫీక్ పైత్ మోదీ హత్యకు పథకం రూపొందించారని తెలిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో గత కొన్నేళ్లుగా పీఎఫ్‌ఐ, సంబంధిత సంస్థల ఖాతాల్లో రూ.120 కోట్లకు పైగా జమ అయినట్లు తేలింది. మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో పీఎఫ్ఐ సభ్యులు హత్రాస్‌కు వెళ్లారని దర్యాప్తులో వెల్లడైంది.

మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్రవాద ముఠా ఏర్పాటుకు ప్లాన్ చేయడం, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ, సున్నితమైన ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేయడంలో పీఎఫ్‌ఐ తన సభ్యుల ద్వారా పాలుపంచుకున్నట్లు ఆధారాలు కూడా కేంద్ర ఏజెన్సీలకు అందాయి. పీఎఫ్ఐ సంస్థను నిషేధించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: