Last Updated:

Delhi: మూడు రోజుల పాటు లిక్కర్ బంద్

ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది.

Delhi: మూడు రోజుల పాటు లిక్కర్ బంద్

Delhi: ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం రేపటితో ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ మద్యాన్ని నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకూడదంటూ అవగాహణ కల్పించారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అలర్ట్ గా ఉంటూ నిబంధనలు మీరిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం.. బలవంతపు మతమార్పిడిలకు 10 ఏళ్లు జైలు శిక్ష

ఇవి కూడా చదవండి: