Last Updated:

Ex Union Minister Chidambaram: ఆర్ధిక సంస్కరణలు తెచ్చిందే మన్మోహన్ సింగ్

దేశ ఆర్ధిక సంస్కరణలపై నేటి కేంద్ర ఆర్ధిక మంత్రి, నాటి కేంద్ర ఆర్ధిక మంత్రుల మద్య మాటల యుద్దం ప్రారంభమైంది. మాటకు మాటకు బదులంటూ మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి ట్విట్టర వేదికగా నేటి కేంద్ర ఆర్ధిక మంత్రి కౌంటర్ ఇచ్చారు

Ex Union Minister Chidambaram: ఆర్ధిక సంస్కరణలు తెచ్చిందే మన్మోహన్ సింగ్

New Delhi: 1991న దేశంలో తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు సగం కాల్చినవి అన్నకేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ మాటలకు మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కౌంటర్ ఇచ్చారు.

చిదంబరం ట్వీట్ చేసిన సమాచారం మేరకు 1991న పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రి హోదాలో ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అప్పటి సంస్కరణను నేడు నిర్మలా సీతారామన్ తప్పుబట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

ప్రతీగా మన్మోహన్ సింగ్ సారధ్యంలో నోట్ల రద్దు, విధి విధానాలు లేని జీఎస్టీ, పెట్రోల్ పై అధిక బాదుడు పన్నులు లేవని నిర్మలమ్మకు చురకలంటించారు. రుచిలేని ఆహారాన్ని మాత్రం అందించలేదని చలోక్తిగా ట్వీట్ చేశారు.

ఓ పుస్తక విడుదల కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 1991 సంస్కరణలను నేటి కేంద్ర ప్రభుత్వం సరళీకృతం దిశగా తీసుకెళ్లుతున్నట్లు వచ్చిన వార్తల పై చిదంబరం పై విధంగా స్పందించారు.

 

ఇవి కూడా చదవండి: