India Pakistan DGMO Meeting: ముగిసిన భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు..!

India Pakistan DGMO Meeting: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో)ల చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇండియా డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. డీజీఎంవోల సమావేశం వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు చర్చలు జరగాల్సి ఉండగా, సాయంత్రానికి వాయిదా పడ్డాయి.
ఇరుదేశాల కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల రెండుదేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 10న రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.