Wedding contract: భర్త రాత్రి 9 గంటల వరకూ స్నేహితులతో గడపవచ్చు.. పెళ్లి కాంట్రాక్టు పై సైన్ చేసిన వధువు
కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి 'అనుమతి' ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది.
Kerala: కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి ‘అనుమతి’ ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది. వైవాహిక జీవితం తర్వాత భర్త తన స్నేహితులతో గడపగలిగే సమయం తగ్గిపోతుందనేది నమ్మకం. దీనికోసం ఈ ఎగ్రిమెంట్ ను రూపొందించగా ఆమె సంతకం చేసింది.
పెళ్లయిన తర్వాత కూడా, నా భర్త రఘుతన స్నేహితులతో రాత్రి 9 గంటల వరకు సమయం గడపవచ్చు. ఆ సమయంలో నేను అతనిని ఫోన్‌లో డిస్టర్బ్ చేయనని వాగ్దానం చేస్తున్నాను అంటూ వధువు అర్చన రూ.50 స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది. నవంబర్ 5 నాటి ఈ ఒప్పందం పై ఇద్దరు సాక్షులు కూడా సంతకం చేశారు. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ జంట నవంబర్ 5న పాలక్కాడ్‌లోని కంజికోడ్‌లో పెళ్లి చేసుకున్నారు.
అస్సాంలో ఒక ఇంట ఇటీవల ఇదేవిధమైన కాంట్రాక్టును కుదుర్చుకుంది. దానిలో నెలకు ఒక పిజ్జాను తినాలి. ఎప్పుడూ ఇంట్లోనే తినాలి. ప్రతి రోజు చీరను ధరించాలి. అర్థరాత్రి పార్టీలు ఓకే కానీ నాతో మాత్రమే. ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లాలి. ఆదివారం అల్పాహారం తయారు చేయాలి. ప్రతి 15 రోజులకు షాపింగ్ చేయాలి వంటి అంశాలు ఉన్నాయి.