Published On:

Covid- 19 Cases in India: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. పెరుగుతున్న మృతులు

Covid- 19 Cases in India: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. పెరుగుతున్న మృతులు

Covid- 19 Cases in India: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం నాటి పరిస్థితులతో పోల్చితే వైరస్ వ్యాప్తి కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో కేసుల నమోదు సంఖ్య కొంత మేర తగ్గుతోంది. కానీ మృతుల సంఖ్య పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

 

కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 163 కరోనా పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా ఢిల్లీలో 65 కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్ లో 51 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6,483 కి చేరింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1384 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గుజరాత్ లో 1105, వెస్ట్ బెంగాల్ 747, కర్ణాటక 653, ఢిల్లీలో 620 కేసులు ఉన్నాయి. కాగా కరోనా బారిన పడి నిన్న నలుగురు చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు కన్నుమూశారు. దీంతో కరోనా వల్ల ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 113 కి చేరింది.