Last Updated:

Bihar:సైకిల్ తొక్కుతూ సెక్రటేరియట్ కు వచ్చిన బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్

రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు మరియు బీహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సచివాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను "తన కలలో చూసిన" తర్వాత ఆయన నుండి ప్రేరణ పొందానని చెప్పారు.

Bihar:సైకిల్ తొక్కుతూ సెక్రటేరియట్ కు వచ్చిన బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్

Bihar:రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు మరియు బీహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సచివాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను “తన కలలో చూసిన” తర్వాత ఆయన నుండి ప్రేరణ పొందానని చెప్పారు. నా జీవితాంతం ములాయం సింగ్ యాదవ్ చూపిన బాటలో నడవడానికి ప్రయత్నిస్తానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ అన్నారు.

కలలో ములాయం సింగ్‌ని చూశాను..(Bihar)

ఈరోజు ఉదయం 22.2.2023న నా కలలో దివంగత ములాయం సింగ్‌ని చూశాను. ఆయన నన్ను కౌగిలించుకుని ఆప్యాయంగా ఆశీర్వదించారు.. నా జీవితాంతం ఆయన చూపిన బాటలో నడవడానికి ప్రయత్నిస్తాను.ఈరోజు సైకిల్‌పై నా మంత్రిత్వ శాఖ అరణ్య భవన్‌కు వెళ్తున్నాను అని బీహార్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ట్వి్ట్టర్ లో పేర్కొన్నారు.

ములాయంసింగ్, నేను పెళ్లికి వెళ్లాము..

నన్ను చూడగానే తేజ్ ప్రతాప్ హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చాడో అని ఆయన ఆశ్చర్యపోయాడు. నేను వృదావన్‌కి వెళుతున్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేతాజీ తో ఆయన గ్రామంలో పర్యటించాలనే నా కోరికను వ్యక్తపరిచాను. అప్పుడు నేను ఒక సైకిల్ ఏర్పాటు చేయమని అడిగాను . దానికినేతాజీ మరింత సంతోషించారు అని తేజ్ ప్రతాప్ అన్నారు.సమీపంలోని గ్రామంలో ఒక వివాహానికి హాజరైన తర్వాత ఇద్దరం తిరిగి వచ్చామని ఆయన తెలిపారు.అతను తన చేతి గడియారాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను భావోద్వేగానికి గురయ్యాను మరియు ఏడవడం మొదలుపెట్టాను. నేతాజీకి కూడా కన్నీళ్లు వచ్చాయి. అతను నన్ను కౌగిలించుకున్నాడు.అకస్మాత్తుగా నేను మేల్కొన్నాను అంటూ తేజ్ ప్రతాప్ చెప్పారు.

నితీష్ కుమార్ పేరు చివర యాదవ్ తగిలించిన తేజ్ ప్రతాప్..

జనవరి నెలలో రోహ్తాస్ జిల్లాలోని కర్గహర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తేజ్ ప్రతాప్ ప్రసంగిస్తూ  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరుకు ‘యాదవ్’ అని చేర్చారు. “నితీష్ కుమార్ ‘యాదవ్’ అన్ని విభాగాల్లో గరిష్ట నియామకాల గురించి మాట్లాడారని అన్నారు. అయితే వెంటనే తన తప్పును గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసారు.మనమంతా ఒక్కటే. అందరూ శ్రీకృష్ణుని వారసులే. యాదవ్-మాధవ్-రఘు-యాదు అందరూ రాముడు మరియు కృష్ణుని వారసులు. మనమంతా ఒక్కటేనని చరిత్ర చెబుతోంది. నితీష్ కుమార్ పేరుచివర ‘యాదవ్’ అని చేర్చడానికి ఇదే కారణమని అన్నారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లాలోని హసన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.రెండుసార్లు సిట్టింగ్‌ జేడీ(యూ) ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రేపై 21,139 ఓట్ల తేడాతో గెలుపొందారు.2015లో తేజ్ ప్రతాప్ వైశాలిలోని మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన రవీంద్ర రేపై విజయం సాధించారు. తన మాజీ భార్య ఐశ్వర్య రాయ్ మహువా నుండి పోటీ చేస్తారనే పుకార్ల కారణంగా తేజ్ ప్రతాప్ మహువాకు బదులుగా హసన్‌పూర్ స్థానం నుండి పోటీ చేయాలని ఎంచుకున్నారు.ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె. చంద్రికా రాయ్ ఆర్జేడీతో సంబంధం కలిగి ఉన్నారు, అయితే కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకున్న తర్వాత జేడీయూలోకి వెళ్లారు.