Last Updated:

Army helicopter crashes: అరుణాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ ‘చీతా ’హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు

Army  helicopter crashes: అరుణాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ  ‘చీతా ’హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

 Army helicopter crashes: భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. వారిని లెఫ్టినెంట్‌ కర్నల్‌ వీవీబీ రెడ్డి, మేజర్‌ జయంత్‌గా గుర్తించారు. రోజువారీ విధుల్లో భాగంగా ఇక్కడి సెంగే గ్రామం నుంచి అస్సాంలోని మిసామారీకి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

బోమిడిలా సమీపంలో కూలిన హెలికాప్టర్..( Army helicopter crashes)

అరుణాచల్‌లోని బోమ్‌డిలా సమీపంలో గురువారం ఉదయం 9.15 గంటలకు ఆర్మీ చెందిన ‘చీతా ’ హెలికాప్టర్‌కు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌ తో సంబంధాలు తెగిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. బోమ్‌డిలాకు పశ్చిమాన ఉన్న మండలా ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే సైన్యం, సశస్త్ర సీమాబల్‌, ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇక్కడి బంగ్లాజాప్‌ గ్రామ సమీపంలో హెలికాప్టర్‌ శకలాలు లభ్యమయ్యాయి. అయితే.. స్థానికంగా వాతావరణం పొగమంచుతో కూడిఉందని, 5 మీటర్ల పరిధి వరకే కనిపిస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు.

చీతా హెలికాప్టర్ ప్రత్యేకత..

చీతాఅనేది ఐదు సీట్ల హెలికాప్టర్ (ఒక పైలట్ + నలుగురు ప్రయాణీకులు లేదా ఇద్దరు పైలట్లు + ముగ్గురు ప్రయాణీకులు.) విస్తృతమైన బరువు, గురుత్వాకర్షణ కేంద్రం మరియు ఎత్తులో ఉన్న పరిస్థితులలో పనిచేయడానికి రూపొందించబడిన అధిక పనితీరు గల హెలికాప్టర్. అన్ని ప్రాంతాల్లో అధిక ఎత్తులో ప్రయాణించడంలో ఇది ప్రపంచ రికార్డును కలిగి ఉంది.

మార్చి 12న 20 మంది ఎయిర్‌మెన్‌లతో కూడిన ఆర్మీ హెలికాప్టర్ కొన్ని సాంకేతిక లోపం కారణంగా జోధ్‌పూర్‌లోని లోహావత్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. జోధ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి ఫలోడీ ఎయిర్‌బేస్‌కు హెలికాప్టర్ బయలుదేరింది.ఒక సాంకేతిక బృందం లోపాన్ని పరిష్కరించింది మరియు ఛాపర్ దాని గమ్యస్థానానికి సుమారు గంట ఆలస్యం తర్వాత టేకాఫ్ చేయగలిగింది.