MLA Gopireddy Srinivas reddy: నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు.. బాలకృష్ణపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్
ఏపీలో రాజకీయాలు నువ్వానేనా అంటూ రోజురోజుకు సై అంటే సై అన్నట్టు ఉన్నాయి. అందులోనూ టీడీపీ వైసీపీ మధ్య అయితే మాటల తూటాలు పేలుతూనే ఉంటున్నోయి. అవికాస్త ముదిరితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.
MLA Gopireddy Srinivas reddy: ఏపీలో రాజకీయాలు నువ్వానేనా అంటూ రోజురోజుకు సై అంటే సై అన్నట్టు ఉన్నాయి. అందులోనూ టీడీపీ వైసీపీ మధ్య అయితే మాటల తూటాలు పేలుతూనే ఉంటున్నోయి. అవికాస్త ముదిరితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ నేత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోందనే చెప్పాలి.
అసలు ఏం జరిగిందంటే..
నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో బాలకృష్ణ పాటకు వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి డ్యాన్స్ వేశారు.
దానికిగానూ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అతన్ని పిలిపించి మందలించారని ఆరోపణలు ఉన్నాయి. దానితో భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వినిపించాయి.
ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట విని తెలిసుకున్న బాలకృష్ణ.. ఎమ్మెల్యే గోపిరెడ్డి పేరు చెప్పకుండానే ఆయనపై సీరియస్ అయ్యారు.
ఇలాంటివి రిపీట్ అయితే బాగోదంటూ హెచ్చరించారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇదీ జరిగిన సంగతి.
నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు(MLA Gopireddy Srinivas reddy)
మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డిపై బాలయ్య ఫైర్ అయ్యారు. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు.
నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు.
మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు. ఇకదీనిపై స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడని తనకు తెలిసిందన్నారు.
బాలకృష్ణ.. విషయం తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలయ్యకు అలవాటుగా మారిందని నోరును అదుపులో మాట్లాడితే మంచిదంటూ గోపిరెడ్డి విమర్శించారు.
అసలు.. నాకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరు? అని ఎమ్మెల్యే గోపిరెడ్డి మండిపడ్డారు. బాలకృష్ణ తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని అన్నారు.
ఏ చర్చకైనా తాను సిద్ధమేనని నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. నోరు పారేసుకుంటూ వార్నింగ్ లు ఇవ్వొద్దన్నారు. మర్యాదగా మాట్లాడాలని చెప్పారు.
మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదని.. వాస్తవాలు గ్రహించి బాలకృష్ణ మాట్లాడాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. మరి ఈ విషయంపై బాలకృష్ణ ఎలా రియాక్టవుతారో వేచి చూడాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/Prime9News