Published On:

Aadhaar Card Rules: ఆధార్ కార్డులో ఈ రెండు వివరాలను ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు.. అవేంటంటే..?

Aadhaar Card Rules: ఆధార్ కార్డులో ఈ రెండు వివరాలను ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు.. అవేంటంటే..?

These Things can change at only once in Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు బిగ్ అప్డేట్. ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు దొర్లినా లేదా పేర్లు, జన్మదినం, అడ్రస్ వంటి వివరాలను మార్పులు చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. అయితే ఇప్పటికీ చాలామంది కొన్ని వివరాలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డును ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చా? మార్పులు చేస్తే ఎలాంటి వివరాలు, ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే యూఐడీఏఐలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

 

ఆధార్ కార్డు భారతీయుల జీవితంలో కీలక డాక్యుమెంట్. ప్రస్తుతం ఆధార్ లేనిది ఎలాంటి పనులు జరగడం లేదు. అయితే కొంతమంది ఈ ఆధార్ విషయంలో తప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆధార్ నమోదు సెంటర్ల వెంట తిరుగుతుంటారు. కాగా, ఆధార్ కార్డు విషయంలో అన్ని వివరాలను ఇష్టానుసారంగా మార్చుకునేందుకు అవకాశం లేదు. ఆధార్ కార్డులో కొన్ని వివరాలకు సంబంధించి పరిమితి విధించింది.

 

ఆధార్ కార్డులో లింగం, పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. పుట్టిన తేదీని మార్చుకునేందుకు తప్పనిసరిగా సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో లింగం కూడా ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ఈ రెండు వివరాలను జీవితకాలంలో ఒకసారి మాత్రమే మార్పులు చేయవచ్చు. రెండోసారి మార్చుకునేందుకు వీలు లేదు.

 

ఇక, ఆధార్ కార్డులో పేర్లను రెండు సార్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అడ్రస్ మార్చుకునేందుకు ఎలాంటి పరిమితి ఇవ్వలేదు. కాగా, ఆధార్ కార్డుపై 12 అంకెల గుర్తింపు ఉంటుంది. ఈ ఆధార్ కార్డును అంతటా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీల నుంచి సబ్సిడీలు, ప్రభుత్వ సేవలు, గుర్తింపు తదితర విషయాలపే యాక్సెస్ చేసేందుకు వీలుగా ఉంటుంది.