Last Updated:

Golden Temple: ముఖంపై భారతీయ జెండాను చిత్రించుకున్న యువతిని అడ్డుకున్న గోల్డెన్ టెంపుల్‌ సిబ్బంది

తన ముఖంపై త్రివర్ణ పతాకాన్ని చిత్రించుకున్న ఒక యువతికి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Golden Temple: ముఖంపై భారతీయ జెండాను చిత్రించుకున్న యువతిని అడ్డుకున్న గోల్డెన్ టెంపుల్‌ సిబ్బంది

Golden Temple: తన ముఖంపై త్రివర్ణ పతాకాన్ని చిత్రించుకున్న ఒక యువతికి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

ఇది పంజాబ్.. ఇండియా కాదు..(Golden Temple)

మందిరంలోకి తన ప్రవేశాన్ని నిరాకరించిన వ్యక్తితో యువతి వాదించినట్లు వీడియోలో చూపబడింది. అయితే మహిళ ముఖంపై జెండా ఉన్నందున లోపలికి వెళ్లలేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అది భారత జెండా అని చెప్పగా దానికి ఆ వ్యక్తి ‘ఇది పంజాబ్, ఇండియా కాదు’ అని బదులిచ్చారని సదరు యువతి స్పష్టం చేసింది.బీటింగ్ రిట్రీట్ వేడుక కోసం అట్టారి-వాఘా సరిహద్దును సందర్శించే చాలా మంది వ్యక్తులు తమ ముఖాలపై త్రివర్ణ రంగులు వేసుకుని ఆపై స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు.

ఈ ఘటనకు సంబంధించి శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు.ఇది సిక్కుల పుణ్యక్షేత్రం. ప్రతి మత స్థలానికి దాని స్వంత  పద్దతులు  ఉంటాయి.అందరికీ స్వాగతం పలుకుతాము.అధికారి తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణలు కోరుతున్నాము. ఆమె ముఖం మీద ఉన్న జెండా అశోకచక్రం లేనిది.మన జాతీయ జెండా కాదు. ఇది రాజకీయ జెండా అయి ఉండవచ్చని పేర్కొన్నారు.