Gold Price Today: తగ్గిన బంగారం ధర, కొనడానికి రెడీగా ఉండండి మరి!

Gold Price Today: బంగారం అంటే సగటు భారతీయులకు మక్కువ. ఏ శుభకార్యానికైనా బంగారు ఆభరణాలు ఉండాల్సిందే. ప్రస్తుత సమాజంలో బంగారంను ఇన్వెస్ట్ మెంట్ గా కూడా వాడుతున్నారు. మహిళలకైతే బంగారం అంటే చాలా ప్రీతి. వేసుకోవడానికి బంగారం, బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి భర్త ఇలా ఎన్నో బంగారంతో ముడిపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా బంగారం రేట్లు దిగొచ్చాయి. కొన్ని రోజుల క్రితం 10గ్రాములకు ( తులం ) లక్ష రూపాయలు ఉన్న బంగారం ధర ఇప్పుడు దిగొచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిస్థితుల వలన బంగారం ధర అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.95,050 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 94,600వద్ద ఉంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 93,930 రూపాయలు. 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు 86100దగ్గర ట్రేడ్ అవుతుంది.
విజయవాడలో 24క్యారెట్ల బంగారం 10గ్రాములకు ధర రూ. 92,090, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 86100రూపాయలు,
బంగారం ముద్దను బిస్కెట్ అంటారు. ఈ బంగారం బిస్కెట్ ను 24క్యారెట్లలో కొలుస్తారు. 22 క్యారెట్ల బంగారాన్ని నగలు తయారుచేయడానికి వాడతారు. మార్కెట్ లలో ఎక్కువగా 24క్యారెట్ల బంగారం బిస్కెట్ దొరుకుతాయి.