CC Camera: అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే.. చివరికి జైలుపాలయ్యాడు
CC Camera: కేరళకు చెందిన ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఓ యువతికి లిఫ్ట్ ఇచ్చాడు. ఇది కాస్త.. సీసీ కెమెరాలకు చిక్కింది. దీనిపై భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. భర్తను జైలుకు పంపించారు.
CC Camera: తెలియని ఓ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినందుకు ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. గుర్తు తెలియని అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. ఇది కాస్త భార్యభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
గొడవకు కారణం అయిన సీసీ కెమెరా..
తెలియని ఓ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినందుకు ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. గుర్తు తెలియని అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. ఇది కాస్త భార్యభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
కేరళకు చెందిన ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఓ యువతికి లిఫ్ట్ ఇచ్చాడు. ఇది కాస్త.. సీసీ కెమెరాలకు చిక్కింది. దీనిపై భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. భర్తను జైలుకు పంపించారు.
కేరళ ప్రభుత్వం.. ‘సేఫ్ కేరళ’ పేరుతో రాష్ట్రంలోని అన్ని రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. స్థానిక ఇడుక్కి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. పనిమీద వెళ్తున్న ఓ వ్యక్తి.. ఓ యువతికి లిఫ్ట్ ఇచ్చాడు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో వాటి ఆధారంగా.. ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తికి చలాన్ విధించారు.
ద్విచక్రవాహనం అతడి భార్య పేరు మీద రిజిస్టర్ కావడంతో ఆమె ఫోనుకు చలానుకు సంబంధించిన ఫొటో, మెసేజ్ వెళ్లాయి. దీంతో ఆ ఇల్లాలు అగ్గి మీద గుగ్గిలమే అయింది. ఆమె ఎవరో తనకు తెలియదని, కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని భర్త మొత్తుకొన్నా వినలేదు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం.. తనను, మూడేళ్ల బిడ్డను భర్త కొట్టాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.