UAE: యూఏఈలో ఇద్దరు కేరళవాసులకు మరణ శిక్ష

2 Kerala Men Executed In UAE For Separate Murders: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణ శిక్ష పడింది. ఓ హత్య కేసులో ఇద్దరు కేరళవాసుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య కేసులో వారి ప్రమేయం ఉందని, అందుకే వారిపై మరణ శిక్ష పడిందనే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, వేరువేరు హత్య కేసుల్లో దోషులుగా నిర్ధారించగా.. మహ్మద్ రినాష్, మురళీధరన్‌గా గుర్తించారు. కన్నూర్ ప్రాంతానికి చెందిన రినాష్.. యూఏఈ దేశానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో దోషిగా తేలింది. అతను అల్ అయిన్‌లోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే మురళీధరన్… తోటి భారతీయుడి వలసదారుడిని చంపినందుకు మరణ శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇద్దరు భారతీయులపై మరణశిక్ష విధించిందని ఫిబ్రవరి 28న యూఏఈ అధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. అయితే, భారత రాయబార కార్యాలయం క్షమాభిక్ష పిటిషన్లతో పాటు క్షమాభిక్ష అభ్యర్థనలను దాఖలు చేసిందన్నారు.