Last Updated:

East Godavari: ఏపీలో కొత్త జంట సరికొత్త ఆలోచన.. పెళ్లి గిఫ్ట్ గా ఆర్గాన్ డొనేషన్..!

నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు.

East Godavari: ఏపీలో కొత్త జంట సరికొత్త ఆలోచన.. పెళ్లి గిఫ్ట్ గా ఆర్గాన్ డొనేషన్..!

East Godavari: నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు. ఏపీలో పెళ్లికి సిద్ధమవుతున్న ఓ జంట సామాజిక బాధ్యతతో వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పెళ్లి రోజున తమ బంధువులను, స్నేహితులను అవయవ దాన హామీ పత్రాEast Godavariలు బహుమానంగా ఇమ్మని కోరారు. పెళ్లి పత్రికలో సైతం కూడా అవయవదానం చేయండి-ప్రాణదాతలు కండి అని మద్రించారు.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. అతనికి ఇటీవల దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల వివాహం నిశ్చయమైంది. నిడదవోలులో గురువారం వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు,అవయవ దానంపై తనకున్న ఆలోచనను యువకుడు, యువతితో పంచుకున్నాడు. పెళ్లి సమయంలో అవయవ దానంపై అవగాహన పర్చేందుకు కార్యక్రమాన్ని చేపడదామని తెలిపాడు. దీనికి ఆమె ఆంగీకారం తెలిపింది.

వారి నిర్ణయాన్ని ఇరువురి తరపున కుటుంబ సభ్యులు కూడా గౌరవించారు. పెళ్ళికూతురుతో పాటు, బంధువులు, స్నేహితులు పెళ్లిరోజు అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సుమారు 60 మంది అవయవదాన హామీ పత్రాలు పెళ్లి రోజు సమర్పించనున్నారు.

ఇవి కూడా చదవండి: