Published On:

CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్.. రెండు రోజులపాటు టూర్..!

CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్.. రెండు రోజులపాటు టూర్..!

Telangana CM Revanth Reddy 2 Days Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజులపాటు హస్తినలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టోని బ్లెయిర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. పెట్టుబడులపై నిర్వహించే కీలక సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు.

 

మరోవైపు సీఎం రేవంత్ పలువురు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీకి సంబంధించి పలు అంశాల ప్రస్తావన గురించి మాట్లనున్నట్టు టాక్. అలాగే రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. రేపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉందని టాక్. మరోవైపు పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.