Last Updated:

ACB court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నలుగుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోనూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

ACB court  : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సిట్ మెమోను  తిరస్కరించిన ఏసీబీ కోర్టు

Telangana Political News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నలుగుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోనూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో A4 గా సంతోష్ జి, A5గా తుషార్, A6 జగ్గు స్వామి, A7 శ్రీనివాస్‌లను చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది. మెమోపై నిందితుల తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్ లేదంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుల తరపు లాయర్ వాదనతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవిస్తూ సిట్ వేసిన మెమోను కొట్టివేసింది. దీంతో ప్రాథమికంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరి పేర్లు లేవు. ఇప్పుటు సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేయడంతో వారిని నిందితుల జాబితాలో సిట్ చేర్చలేకపోయింది.

సీబీఐతో విచారణ జరిపించాలని జగ్గూ స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. డివిజన్ బెంచ్ ఆదేశాలు చాలా క్లియర్ గా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలని కోరడం సమంజసం కాదని సిట్ తరపున వాదించిన దుష్యంత్ దవే చెప్పారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, నిందితులతో సంబంధం లేదంటూనే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు.

హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలో వారిని నిందితులుగా పరిగణించాన్న మెమో ఏసీబీ కోర్టులోనే ఉంది. ఇప్పుడు తిరస్కరణకు గురవడంతో.. వారిని నిందితుల జాబితాలో చేర్చి విచారణకు పిలువలేని పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి: