Last Updated:

Moinabad Farm House Case: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

Moinabad Farm House Case: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు

Moinabad Farm House Case,: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సీబీఐతో విచారణ చేసేందుకు అనుమతించింది. సిట్ దర్యాప్తును కూడా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఇటీవలనే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ విచారణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో సాగుతుందని బీజేపీ ఆరోపించింది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ తో పాటు ముగ్గురు నిందితులు మరొకరు ఇదే డిమాండ్ తో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సుదీర్థంగా వాదనలు వింది. సిట్ విచారణ సరిగా జరగడం లేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సిట్ దర్యాప్తును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: