Last Updated:

YS Vijayamma: నేను మెల్లిగా చేయి ఎత్తాను అంతే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు- విజయమ్మ

YS Vijayamma: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. షర్మిలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

YS Vijayamma: నేను మెల్లిగా చేయి ఎత్తాను అంతే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు- విజయమ్మ

YS Vijayamma: షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన విజయమ్మ.. మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. లోటస్ పాండ్ వద్ద.. షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ స్టేషన్ కు తరలించినట్లు తెలుసుకున్న విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో అక్కడ వాగ్వాదం నెలకొంది. దీంతో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. అయితే తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

నేను కొట్టలేదు.. (YS Vijayamma)

షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన విజయమ్మ.. మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. లోటస్ పాండ్ వద్ద.. షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ స్టేషన్ కు తరలించినట్లు తెలుసుకున్న విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో అక్కడ వాగ్వాదం నెలకొంది. దీంతో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. అయితే తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. పోలీసులను ప్రశ్నించారు. అకారణంగా నా బిడ్డను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో విజయమ్మను అక్కడి నుంచి ఇంటికి బలవంతంగా పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టగలను.. నేను మెల్లిగా చెయ్యి ఎత్తాను అంతే.. మీడియాలో నేను చాలా గట్టిగా కొట్టినట్లు చూపిస్తున్నారని తెలిపారు.

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. షర్మిలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

షర్మిల ప్రజల కోసం పోరాడుతుందని.. తాను ఓ టెర్రరిస్ట్ ఏం కాదని అన్నారు.

షర్మిల అరెస్టుకు కారణం ఏంటో చెప్పమని అడిగానే తప్పా.. ఎవరిపై చేయి చేసుకోలేదని అన్నారు.

పోలీసులు పై పైకి వస్తుంటే.. ఆవేశం రాదా అని ప్రశ్నించారు. నేను కొట్టాలనుకుంటే కొట్టగలను..నేను కొట్టలేదు అని అన్నారు.

నియంత, అసమర్ధ పాలనను ప్రశ్నిస్తున్నారని… ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిల సిట్ కార్యాలయానికి వెళ్తుంటే అరెస్ట్ చేశారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.

కాగా.. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వైఎస్ విజయమ్మ.. కూతురు షర్మిలను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయి చేసుకున్నారు.