Published On:

Telangana Cabinet: ఈ రోజే తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Telangana Cabinet: ఈ రోజే తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Telangana Cabinet Held Today: తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

 

అయితే రేపు జరగనున్న మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై పూర్తి క్లారిటీ రానుంది. నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన గురించి కేబినెట్ చర్చించనుంది. అలాగే త్వరలోనే రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.