Intermittent Fasting: బరువు తగ్గడానికి డైటింగే కాదు.. ఉపవాసాలు కూడా పనికి వస్తాయట.!

బరువు తగ్గడానికి డైటింగ్ మాత్రమే కాదు.. ఉపవాసాలు కూడా పనికి వస్తాయట
Intermittent Fasting: పరిశోధనలు మొత్తం భారతీయతను అద్దం పడుతున్నాయి. వేల ఏళ్లనుంచి భారత్ లో ఉపవాసం చేసేవాళ్లు ఉన్నారు. మహిళలు ప్రతివారం ఏదో ఒక రోజులో ఉపవాసం చేస్తున్నా… అందరూ కలిసి చేసే ఒకే ఒక్కటి శివరాత్రి ఉపవాసం. అయితే ఇఫ్పుడు బరువు తగ్గడానికి కూడా ఉపవాసం మంచిదేనని పాశ్చాత్య పరిశోధనలు తెలుపుతున్నాయి. ది బీఎమ్జే ( The BMJ) అనే జర్నల్ లో ప్రచురించిన అధ్యయనంలో బరువు తగ్గడానికి డైటింగ్ మాత్రమే కాదు అడపాదడపా ఉపవాసం కూడా పనికొస్తుందని తెలుసుకున్నారు. దీని వలన బరువును కంట్రోల్ లో పెట్టుకోవచ్చని తెలుసుకున్నారు పరిశోధకులు.
2022నాటికి ప్రపంచంలో 2.5 బిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారట. అంటే రెండు వందల యాబై కోట్ల మంది అన్న మాట ప్రపంచవ్యాప్తంగా. మామూలుగా అయితే గతంలో భారతదేశంలో ఎక్కువగా ఊబకాయస్థులు ఉండే వారు కాదు. పుష్టిగానే ఉండేవారు. అయితే మారిన కాలమానపరిస్థితుల్లో భోజన పద్దతులు మారాయి. విదేశీ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చి మన పంచన చేరింది. దీంతో మనకు ఊబకాయం మొదలైంది. కాబట్టి దాన్ని తగ్గించుకునేందుకు జిమ్ములకు పరిగెత్తుతున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. మనపని మనం చేసుకుంటూనే కేవలం ఉపవాసం ఉండటం వలన ఊబకాయం తగ్గిపోతుంది.
తాజాగా 6500మందిపై ఉపవాసాన్ని చేయించి అధ్యయనం చేశారు పరిశోధకులు. ఇవి 52వారాలపాటు సాగాయి. ఇందులో ఉపవాసం ఉన్నవారి బరువులో తగ్గుదల కనిపించింది. అదీకూడా అడపాదడపా ఉపవాసమే. కాబట్టి ఉపవాసం చేయడం వలన మన బరువు ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇందుకుగాను 24 వారాల నుంచి 52 వారాల వరకు అడపాదడపా ఉపవాసం ఉండటం మంచిదని తెలుస్తోంది. ఇందుకు మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే ఎలాగో భారతీయ జీవన విధానంలో మన నానమ్మల, అమ్మమ్మల కాలం నుంచి ఉపవాసం ఉంది కాబట్టి మీ ఇంట్లో చేసే ఉపవాసాలలో ఏదో ఒకటి అడపాదడపా చేయవచ్చన్నమాట.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఆచరించే ముందు నిపుణుల సలహా తీసుకోగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.