Published On:

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Cabinet Meeting On local Elections: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ కానుంది. స్థానికల సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల వర్తింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. అలాగే త్వరలో ఏపీ సీఎం చంద్రబాబుతో జరగబోయే చర్చలపై మాట్లాడాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, నిధుల సమీకరణపై చర్చ జరగనుంది.

ఇవి కూడా చదవండి: