Woman Cheating In Marriage: 12మందితో పెళ్లి.. అంబేద్కర్ జిల్లాలో కిలాడీ లేడీ.!

woman cheating in marriage: వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతురుపై అంబేద్కర్ కోనసీమ జిల్లాఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్నారు.
విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వివాహం చేసుకుంటామని చెబుతారు. ఈ లోపు వారి నుండి అధికమొత్తంలో డబ్బును దోచుకుంటారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని వీరు పరారయ్యారు. ఇటీవల నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమ సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.