Published On:

Srisailam Temple: శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు, బుల్లెట్ల కలకలం

Srisailam Temple: శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు, బుల్లెట్ల కలకలం

Bullets found at srisailam temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు, బుల్లెట్ల దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలే సెన్సిటివ్ ఏరియా, అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో…శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. శ్రీశైలానికి ఉగ్రవాదుల ముప్పు ఉందనే ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బాంబులు, బుల్లెట్లు కనిపించడంతో….ఏ క్షణం ఏం జరుగుతుందోనని భక్తులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముందుగానే గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

శ్రీశైలం ఆలయం సమీపంలోని వాసవీ సత్రం ముందునుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్‌ వద్ద ఉన్న సంచిని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది సంచిని తనిఖీ చేసి అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇది మావోయిస్టుల పనా? లేక ఎవరినైనా చంపేందుకు ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శైవ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీశైలంలో నిత్యం రద్దీ ఉంటుంది. ఏపీలో తిరుపతి తర్వాత చెప్పుకోదగ్గ పుణ్యక్షేత్రం. అయితే ప్రస్తుతం ఇస్లామిక్‌ ఫండమెంటలిజం, టెరర్రిజం ద్వారా దాడులకు పాల్పడుతూ దేశసమగ్రతను, భద్రతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు మనతోపాటు ఉంటూనే ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల సీన్….భక్తులకు, అటు పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో ఆలయాలే కాకుండా చర్చిలు, మసీదుల వద్ద కూడా భద్రతా నిఘా పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: