Rythu Bharosa: రాష్ట్రంలో 66.19 లక్షల మందికి రైతుభరోసా

Rythu Bharosa Money Credits: రైతుభరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7770.83 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు.
అనుకున్న సమయానికి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం అందిచడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ చర్య రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతం అందించడమే కాకుండా, రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. రైతులకు అనుకున్న సమయానికి రైతుభరోసా నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.