Published On:

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

IMD Issued Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడొచ్చని తెలిపింది. అలాగే 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని సూచించింది.

ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: