MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ కు మావోల వార్నింగ్

Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని దుండగుడు చెప్పాడు. అయితే ఫోన్ ను ఎంపీ పీఏ ఆన్సర్ చేశారు. దమ్ముంటే ఎంపీ రఘునందన్ ని కాపాడుకోవాలని బెదిరింపులు చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
కాగా ఎంపీ రఘునందన్ రావు ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే కాల్ రావడంతో ఎంపీ రఘునందన్.. డీజీపీ జితేందర్, సంగారెడ్డి ఎస్పీ, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన నంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.