Published On:

Emergency Number : డయల్ 112.. ఇక 100 మర్చిపోండి.. ఎనీ ఎమర్జెన్సీ అమల్లోకి కొత్త నంబర్

Emergency Number : డయల్ 112.. ఇక 100 మర్చిపోండి.. ఎనీ ఎమర్జెన్సీ అమల్లోకి కొత్త నంబర్

Emergency Number : డయల్ 100 ఎంతో ఫేమస్. ఆపదలో ఉన్నామని ఒక్క కాల్ చేస్తే చాలు.. పోలీసులు కుయ్ కుయ్ మంటూ వాహనాల్లో వచ్చేస్తారు. ఎలాంటి ప్రమాదం నుంచి అయినా రక్షిస్తారనే నమ్మకం బాధితుల్లో ఉంది. అర్ధరాత్రి ఆడపిల్ల నడిరోడ్డుపై ఒంటరిగా నడస్తోందంటే అందుకు కారణం డయల్ 100 నంబర్. ఆ నంబర్ అంతటి ధీమా కల్పించింది. ఇక్కడో చిన్న ఇబ్బంది కూడా ఉంది. అగ్నిప్రమాదం జరిగితే కూడా డయల్ 100కు కాల్ చేస్తుంటారు. మెడికల్ ఎమర్జెన్సీకి అదే నంబర్‌కు ఫోన్ చేసేవాళ్లు.

 

100 నంబర్‌తో సమస్య..
అనేక విభాగాల్లో కీలక నెంబర్లు ఉన్నా ప్రజలకు గుర్తులేవు. కేవలం డయల్ 100 నంబర్ గుర్తు పెట్టుకున్నారు. అలాంటి సమస్యను పరిష్కరించడానికే కేంద్రం సరికొత్తగా డయల్ 112 తీసుకొచ్చింది. ఒకే నెంబర్‌తో అన్నిరకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ విధానాన్ని కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 112కు ఫోన్ చేయాలి. అందుకే కొత్త నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి.

 

తెలంగాణలో ఎమర్జెన్సీ నెంబర్ మారింది..
తెలంగాణలో ఎమర్జెన్సీ నంబర్ మారింది. ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం డయల్ 100 ఉండేది. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇదే నంబర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్నేళ్లు తెలంగాణలో పోలీసుల హెల్ప్‌లైన్ కోసం 100. అగ్నిమాపక సిబ్బంది 101, మెడికల్ అర్జెన్సీకి 108, చైల్డ్ కేర్‌కు 1098 ఇలా పలు విభాగాలకు వేర్వేరు అత్యవసర నంబర్లు ఉండేవి. ఇలాంటి అన్ని సేవల కోసం 112 నంబర్‌కు డయల్ చేస్తే సరిపోతుంది.

 

జీపీఎస్ ద్వారా ట్రాక్..
ఈ నంబర్‌కు డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే ఘటనా స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు. అండ్రాయిడ్‌ ఫోన్లలో మరో సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితో ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ కానుంది. ఇక కీ ప్యాడ్‌ ఫోన్లలో 5 లేదా 9 నిమిషాల కంటే ఎక్కువసేపు నొక్కి ఉంచితే ఎమర్జెన్సీ సాయం అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి: