Published On:

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు అంశాలపై చర్చ!

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు అంశాలపై చర్చ!

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

 

అయితే ఇవాళ జరగనున్న మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై పూర్తి క్లారిటీ రానుంది. నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన గురించి కేబినెట్ చర్చించనుంది. అలాగే రైతు భరోసా పథకం అమలు, యాసంగి పంటలకు పెండింగ్ నిధుల చెల్లింపు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. నిధుల విడుదలకు మంత్రివర్గం ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ జరగనున్నట్టు టాక్. మరోవైపు యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి చేసేలా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. దీంతో మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.