Surveyor Tejeswar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్!

Shocking twist in Tejeshwar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఐశ్వర్య కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు పథకం వేసుకున్నట్లు తెలిసింది.
తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే వారికి పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని ఐశ్వర్యతో పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌తోపాటు తన భార్యను చంపాలని పథకం వేసుకున్నాడు. దీంతో ఐశ్వర్యతో కలిసి లడాఖ్‌కు ట్రిప్ ప్లాన్ వేశాడు. భార్యను చంపితే బంధువు దగ్గర చెడ్డ పేరు వస్తుందన్న భయంతో పథకాన్ని విరమించుకున్నాడు. తేజేశ్వర్‌ను మాత్రమే చంపాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం తేజేశ్వర్ హత్య జరిగిన ముందురోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అప్పటికే భర్త తేజేశ్వర్‌ను చంపేందుకు ఐశ్వర్య 5సార్లు ప్రయత్నించింది. జూన్ 17న ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్‌కు సమాచారం అందించేందుకు భార్య ఐశ్వర్య తేజేశ్వర్ బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. దాని ఆధారంగా అతడి లొకేషన్ వివరాలను ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్‌ను రాజు, పరమేశ్వర్, పరుశరాం వెంట తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపారు. కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని మరుసటిరోజు తిరుమలరావు వెళ్లి చూసి వచ్చాడు. అటుపై సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమలరావు కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతడు లడఖ్‌లోని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కేసు నేపథ్యం..
జోగులాంబ గద్వాలకు చెందిన సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమలరావుతో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. కొన్ని రోజులకే ఐశ్వర్య తిరిగి వచ్చింది. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.
దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా మే 18న ఐశ్వర్యను తేజేశ్వర్ పెళ్లి చేసుకున్నాడు. తిరుమలరావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే భావించింది. దీంతోనే పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులో గడిపింది. చివరకు తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో ఈ నెల 17న భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు. కేసులో ఐశ్వర్య, తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను నిందితులుగా చేర్చారు పోలీసులు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పనిచేసే బ్యాంకు