Published On:

Revanth Reddy : రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదుర్కోబోతున్నాం : సీఎం రేవంత్‌‌రెడ్డి

Revanth Reddy : రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదుర్కోబోతున్నాం : సీఎం రేవంత్‌‌రెడ్డి

CM Revanth Reddy: రాబోయే రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికల తదితర అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. త్వరలోనే మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు.

 

మరోసారి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి వచ్చేలా సైనికుల్లా పనిచేయాలని సూచించారు. బూత్‌, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. లక్ష్యాలు నిర్దేశించుకొని నాయకులు పనిచేయాలని కోరారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయని రేవంత్‌ తెలిపారు.

 

కులగణన చేసి ప్రధాని మోదీ సర్కారుకు సవాల్‌ విసిరామన్నారు. కేంద్రం జనగణనతోపాటు కులగణన చేసే పరిస్థితికి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ తీసుకువస్తున్నామని చెప్పారు. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రియాశీలంగా ఉండాలన్నారు. పార్టీ పదవిని కార్యకర్తలు చిన్నచూపు చూచొద్దన్నారు. పదవుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కార్యకర్తలకే తీరని నష్టం జరగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి: