Published On:

Ponnam @Ujjain: సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష!

Ponnam @Ujjain: సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష!

Minister Ponnam Prabhakar reviews on Ujjain Bonalu Festival: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్ష జరిగింది. జులై 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు  ప్రారంభం కానున్నాయి. బోనాల పండుగను పురస్కరించుకొని అన్ని విభాగాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్నిశాఖల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎలక్ట్రిసిటీ గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. తోపులాటలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లష్కర్ బోనాలు హైదరాబాద్‌‌కు గర్వకారణమని కొనియాడారు. హైదరాబాద్ వాసులు అతిథులకు ఆతిథ్యం చెప్పడంలో ప్రసిద్ధులు అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాల్సిన బాధ్యత మనదేనని వ్యాఖ్యానించారు.

 

గోల్కొండ, ఉజ్జయిని, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. బోనం ఎత్తుకునే భక్తులంతా వీఐపీలే అన్నారు. వీఐపీ పాసులను బోనాలు లేని రోజుల్లో మాత్రమే ఇస్తామన్నారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఉత్సవాలు విజయవంతంగా పూర్తవుతాయని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి: