Published On:

Jeedimetla Mother Killed: జీడిమెట్లలో లవర్ తో కలిసి తల్లిని చంపిన బాలిక

Jeedimetla Mother Killed: జీడిమెట్లలో లవర్ తో కలిసి తల్లిని చంపిన బాలిక

Girl Murdered her Mother in Jeedimetla: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం జరిగింది. ఎన్ఎల్బీ నగర్ లో ప్రియుడితో కలిసి కన్నకూతురే తల్లిని హత్య చేసింది. శివ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం తెలిసి మందలించినందుకే ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. జీడిమెట్లకు చెందిన బాలికకు పగిల్ల శివ అనే యువకునితో 8 నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం తెలిసి బాలికను తల్లి మందలించింది.

 

దీంతో తల్లిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్న 10వ తరగతి బాలిక ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేసింది. కాగా బాలిక రెండు రోజుల క్రితం ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని, బాలిక బంధువులు తిరిగి ఇంటికి తీసుకువచ్చారని బంధువులు తెలిపారు. మహిళను తీవ్రంగా గాయపరిచి, చున్నీతో ఉరి వేసి హత్య చేశారని సమాచారం. ఘటనపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: