Last Updated:

Revanth Reddy: తెలంగాణలో 15 రోజులపాటు భారత్ జోడో యాత్ర.. రేవంత్ రెడ్డి

భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు.

Revanth Reddy: తెలంగాణలో 15 రోజులపాటు భారత్ జోడో యాత్ర.. రేవంత్ రెడ్డి

Hyderabad: భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదల, తీవ్రమైన నిరుద్యోగ సమస్య, అవినీతి, రాజకీయ ఫిరాయింపులతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడతామన్నారు. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో తెలంగాణ నుంచి వివిధ స్థాయిల్లోని నేతలందరూ వస్తారని తెలిపారు.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుందని, భారత్ జోడో యాత్ర తెలంగాణలో 14-15 రోజుల పాటు 360 నుంచి 370 కిలో మీటర్లు సాగనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అన్నారు. దేశాన్ని ఏకంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజలకు మనోధైర్యాన్ని కల్గించడానికి 160 నుంచి 170 రోజుల పాటు ఏకధాటిగా రోజుకు 25 కిలో మీటర్ల మేర నడుస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలిసి, వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారని వివరించారు.

2024లో అధికారంలోకి వచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తారన్నారు. భాష, మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చేస్తోందని విమర్శించారు. దేశాన్ని చీల్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసమే భారత్ జోడో యాత్ర అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులే కాదు. తెలంగాణ సమాజం మొత్తం ఈ యాత్రలో పాల్గొనాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి: