Pragati Bhavan vs Raj Bhavan: మరోసారి ప్రగతి భవన్ X రాజ్ భవన్
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
Prime9Special: ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది. సీఎం ఏరియల్ సర్వేకు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్ కు వెళ్ళటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
గవర్నర్ తమిళ్ సై, సీఎం కేసీఆర్ మధ్య గత కొంతకాలంగా సఖ్యత కొరవడింది. ఇద్దరు తగ్గేదిలే అన్నట్లుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఇటీవల రాజ్ భవన్ లో హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావటం హాట్ టాపిక్ అయింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో గవర్నర్ ఆత్మీయంగా మాట్లాడటంతో వ్యవహారం అంతా సద్దుమనిగిందని అంతా భావించారు. తాజాగా వరద ప్రాంతాల పర్యటనలు మళ్ళీ ఇద్దరి మధ్య అగ్గి రాజేసిందనే చర్చ జరుగుతోంది.వాస్తవానికి గవర్నర్ తమిళ సై కొత్తగూడెం పర్యటన ముందుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే సీఎం కెసీఆర్ ఏరియల్ సర్వే పర్యటన ప్రకటన వెలువడింది. గవర్నర్ ఒక రోజు ముందుగానే వెళ్లి, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీయనున్నారు. వాస్తవానికి గవర్నర్ పర్యటన వల్ల అప్పటికప్పుడు బాధితులకు సాయం అందేది ఏమీ ఉండక పోయినా, ఆమె మాత్రం ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన కోసం గవర్నర్ ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
సీఎం కెసీఆర్ ఆఫీసు నుంచి ఆకస్మాత్తుగా ఏరియల్ సర్వే ప్రకటన వెలువడింది. దీంతో ఈ అంశమే రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది. అయితే మొదట కేసీఆర్ ప్రత్యేక హెలి క్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సీఎంఓ నుంచి ప్రకటన వెలువడింది. ఎప్పుడైతే గవర్నర్ క్షేత్ర స్థాయిలో వరద బాధితులను కలుస్తారని మీడియాలో కథనాలు వచ్చాయో, వెంటనే సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఇక తాను కూడా ఏరియల్ సర్వే తో అక్కడక్కడ వరద బాధితులను కలిసేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం.చాలా కాలం నుంచి గవర్నర్ తమిళ్ సై పర్యటనలకు అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదు. దీనిపై ఆమె నేరుగానే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మద్య వార్ కంటిన్యూ అయింది. ఇక సీఎం రాజ్ భవన్ కు వెళ్ళటంతో వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే వరద రాజకీయం, ఇద్దరి మధ్య యుద్ధానికి కారణం అయిందనే చర్చ జరుగుతోంది.