Home / తెలంగాణ
లుగువారి ఆరాధ్య నటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్... దశాబ్దాలుగా సామాజికసేవలో తరిస్తున్న రియల్ హీరో.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది . పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు... అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్పీఎస్సీ ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ యాదయ్య, వై.రామ్మోహన్ రావులను ప్రభుత్వం నియమించింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలు, ఆరు మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా,జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.
కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ప్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు.