Last Updated:

Shiva Balakrishna Assets Case: రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అరెస్ట్

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Shiva Balakrishna Assets Case: రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు..  హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అరెస్ట్

Shiva Balakrishna Assets Case: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఆస్తులన్నీ బినామీలపైనే..(Shiva Balakrishna Assets Case)

సోదాల్లో సుమారు 58 ఖరీదైన వాచీలు, దాదాపు 26 ఐఫోన్లను, 70 ఎకరాలకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. నానక్ రామ్ గూడాలోని ఇంట్లో 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులన్నీ బినామీ పేర్లపై ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసం, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. 2018-2023 కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో కీలక హోదాలో పనిచేసిన శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలు, తాజాగా వారిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.