Last Updated:

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?

బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?

Former CM KCR:బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ (నెం. 45/2024) తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది.

అతి తక్కువ ధరకే..(Former CM KCR)

ప్రభుత్వం కేటాయించిన భూమి ధర రూ.1100 కోట్లు ఉంటుందని కాని అప్పటి కలెక్టర్ కేవలం రూ.37.53 కోట్లకు ధరను నిర్ణయించి కేటాయించారని దీనిని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై గత విచారణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్‌ఏకు లేఖ రాశానని కోర్టుకు వివరించారు.తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అప్పటి ముఖ్యమంత్రి, రెవెన్యూ సెక్రటరీ, దీనికి బాధ్యులయిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది.